అన్లాక్-4 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం
1 min read
అన్లాక్-4 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం.
అన్లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది.దశలవారీ పద్ధతిలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిది. సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లు మాల్క్ మూసే ఉంటాయి.సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది.
అలాగే 21 నుంచి క్రీడలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది.సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది.100 మందికి మించి హాజరు కాకూడదని నిబంధన విధించింది.అంతర్ రాష్ట్ర రవాణాకు సైతం అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.
అలాగే 65 ఏళ్లు పైబడిన వారు,ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,గర్భిణిలు,10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలకు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించింది.ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది.