Sootigaa.com

Straight to the point.

దేవాలయాలపై దాడులకు నిరసనగా తెదేపా కార్యక్రమాలు

1 min read
Protests by TDP all over AP against attacks on Hinduism.

దేవలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం. ఉదయం పరిటాల లోని ఆంజనేయ స్వామి గుడి లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు , మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య , మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు గారు పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవలయాలపై దాడులు ఎక్కువ గా జరుగుతున్నాయి అని దేవినేని అన్నారు.వెంటనే ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమ వెంకట్రావు,16 గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

హిందూత్వంపై వైకాపా దాడులకు నిరసనగా కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయంలో దేశం నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పూజలు చేయడం జరిగినది అనంతరం మీడియాతో మాట్లాడుతూ.

16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపై విచారణ జరపాలి.

బిట్రగుంట సంఘటన పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే అంతర్వేది లో దారుణం జరిగేదా?

151 సీట్లు వచ్చాయన్న మితిమీరిన అహంకారంతో నిర్లక్ష్య ఉదాసీన వైఖరితో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.

వీటిని ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన లేదా ? ఈ ప్రభుత్వం పైన లేదా ? వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాలి?

రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరినీ కలుపుకుని గ్రామాల్లో దేవాలయాల దగ్గర పూజలు చేసి రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద ధార్మిక సంస్థల మీద విగ్రహాల మీద జరుగుతున్న దాడులు ఖండిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆరు రోజులు దేవాలయాల్లో పూజలు చేయమని చెప్పారు మొదటి రోజు సూర్య దేవాలయంలో లో సోమవారం శివాలయాల్లో ఈ రోజు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో బుధవారం నాడు అయ్యప్ప స్వామి దేవాలయాల్లో గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాల్లో శనివారం వైష్ణవ దేవాలయాల్లో పూజలు చేసి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తాం ఏదైతే ప్రభుత్వ నిర్లిప్తత నిర్లక్ష్యం ఉదాసీనత వల్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ 16 నెలల్లో ముఖ్యమంత్రి గారు కానీ బాధ్యత గల మంత్రులు గానీ ప్రభుత్వం గానీ వెంటనే స్పందించి గట్టిగా చర్యలు తీసుకున్నట్లయితే ఈ విగ్రహాల మీద దాడులు జరిగేవి కాదు ఈ రథాలు తగలబెట్టే కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు.

అంతర్వేది దేవాలయం వద్ద రథం తగులబెట్టిన కార్యక్రమం చూసినట్లయితే ప్రభుత్వం నుండి వచ్చిన వివిధ ప్రకటనలు మొదటిరోజు షార్ట్ సర్క్యూట్ అన్నారు తర్వాత కరెంటు లేదని తెలిసింది తరువాత పిచ్చి వాడు తగలబెట్టారు అన్నారు తరువాత తేనేతుట్టి తగలబెడితే తగలబడింది అన్నారు.

ఇటువంటి చర్యలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడ లేక పోతున్నారు? ప్రజల ముందుకు వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

నందిగామమండలం పల్లగిరి,రాఘవాపురం, పెద్దవరం గ్రామాలలో జరుగుచున్న గ్రావెల్ మైనింగ్ అక్రమ త్రవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని దేశం నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ నందిగామ మరియు తహసిల్దార్ నందిగామ వారికి మెమోరాండం అందచేసారు.అనంతరం తంగిరాల సౌమ్య మాట్లడుతూ 2 రోజుల క్రితం పల్లగిరి గ్రావెల్ మైనింగ్ అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవడం జరిగినది.అనుమతులు చుపామని ప్రశ్నిసిస్తే సమాధానం లేదని. అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అక్రమ గ్రావెల్ ను తమ ప్రైవేటు లే అవుట్లలో ఎటువంటి అనుమతులు లేకుండా వాడుకోవడం జరిగినది అని వీటి అన్నింటి పైన సమగ్ర విచారణ జరపాలని. భాద్యుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసారు. లేనియెడల రానున్న రోజులలో దీని పై తెలుగుదేశం పార్టీ తరుపున తాను ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్దం అని తెలియచేసారు.

error: Content is protected !!