Sootigaa.com

Straight to the point.

ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారన్న చంద్రబాబు

1 min read
కరోనా కష్ట కాలంలో వైకాపా ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు అన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
nara-chandrababu-naidu

టిడిపి సీనియర్ నేతలతో మన చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు

వైసిపి ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు: చంద్రబాబు నాయుడు
10రోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు-దేశంలో నమోదయ్యే కేసులలో 13% ఏపిలోనే
డిశ్చార్జ్ అయ్యేవాళ్లకు రూ 2వేలు, మృతుల అంత్యక్రియలకు రూ15వేలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలు..ఎవరికీ రూపాయి ఇవ్వడం లేదు.
మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయం.
0.25% అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం
వైసిపి దుర్మార్గాలను అడ్డుకోవాలి, రైతుల ప్రయోజనాలు కాపాడాలి
ఏపిలో ఉన్న 19వేల మెగావాట్ల సామర్ధ్యంలో 15వేల మెగావాట్ల విద్యుత్ టిడిపి పెంచినదే
4ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపికి టాప్ ర్యాంక్ టిడిపి పారిశ్రామిక విధానానికి గొప్ప రేటింగ్
పారిశ్రామిక వేత్తలను బెదిరించి, వైసిపి గవర్నమెంట్ టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు.
కియాకు ఇచ్చే రాయితీలు వైసిపి దృష్టిలో పెనాల్టీనా..? కియా రావడం వైసిపికి ఇష్టం లేదు.
వైసిపి బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి.
జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక ఏపిలో దళితులపై దాడులు జరగని రోజు లేదు
దళితుల ఇళ్లు తగులపెట్టడం, సజీవ దహనానికి యత్నం..
శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్ లు, వైసిపి అకృత్యాలకు లెక్కేలేదు.
దళితులపై వైసిపి దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలి.
ప్రతి జిల్లాలో వైసిపి బాధిత దళిత కుటుంబాలకు అండగా ఉండాలి.
వైసిపి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరం
టిడిపి హయాంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం.
ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా అన్నిమతాలను గౌరవించాం.
వైసిపి వచ్చాక దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు.
ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం
వైసిపి ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే.
టిడిపి ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారు
సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా..?
రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక నిలిపేయడం సంపూర్ణ పోషణా..?
గిరిజనుల ఫుడ్ బాస్కెట్ రద్దు సంపూర్ణ పోషణా..?
జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరు.
నోరు తెరిస్తే అబద్దం, రోజుకో నాటకం, మాట తప్పడం, మడమ తిప్పడం..
వైసిపి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అరాచకాలను ఎండగట్టాలి
‘‘పసుపు చైతన్యం’’ 100రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలి
టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ కరోనా వైరస్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. తొలి లక్ష కేసులకు 138రోజులు పడితే ఇప్పుడు 10రోజులకే లక్ష కేసులు వస్తున్నాయి అంటే వైరస్ ఏ స్థాయిలో విస్తృతం అవుతుందో తెలుస్తోంది. దేశంలో నమోదయ్యే కేసులలో 13% ఏపిలోనే. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 15జిల్లాలలో 7 ఏపివే. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.
సరైన పర్యవేక్షణ లేక 30% ఆక్సిజన్ వృధా అవుతోందని, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో జాప్యంపై, వచ్చిన వెంటిలేటర్లు కూడా ఐసియూలో అమర్చే దిక్కులేదని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తోంది.
క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జ్ అయినవాళ్లకు రూ2వేలు, మృతుల అంత్యక్రియలకు రూ15వేలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ50లక్షలు…ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోక పోవడం క్షమించరాని నేరం. ప్రధాని, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ధరిస్తుంటే, మన రాష్ట్రంలో సీఎం జగన్, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయం.
ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు రూ5లక్షల కోట్లు జిఎస్ డిపి తగ్గనుందని అంచనా. ఏపికి రూ2.53లక్షల కోట్ల నష్టం.
ఈ పరిస్థితుల్లో మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయం. పొరుగు రాష్ట్రాల్లో లేని మీటర్లు ఏపిలోనే ఎందుకు..? 0.25% అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం గర్హనీయం.
40ఏళ్ల పోరాటంతో రైతులు సాధించుకున్న ఉచిత విద్యుత్ కు మీటర్ల పేరుతో మంగళం పాడాలని వైసిపి చూస్తోంది. టిడిపి సహా ఇతర ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఈ దుశ్చర్యలను అడ్డుకోవాలి. రైతుల ప్రయోజనాలను కాపాడాలి.
ఉమ్మడి రాష్ట్రంలో 30ఏళ్లలో విద్యుత్ సామర్ధ్యం 5వేల మెగావాట్లు ఉంటే టిడిపి ప్రభుత్వం 5ఏళ్లలోనే 10వేల మెగావాట్లకు పెంచింది. విభజన తర్వాత 13జిల్లాల ఏపిలో విద్యుత్ సామర్ధ్యం 10వేల మెగావాట్లు పెంచాం. ప్రస్తుతం ఏపిలో ఉన్న 19వేల మెగావాట్లలో 15వేల మెగావాట్లు టిడిపి ప్రభుత్వం పెంచిన అదనపు ఉత్పత్తి సామర్ధ్యమే..సంస్కరణలు చేపట్టి టిడిపి నిలబెట్టిన విద్యుత్ వ్యవస్థను మళ్లీ అస్తవ్యస్థం చేస్తున్నారు. టిడిపి 5ఏళ్లలో కరెంటు ఛార్జీలు రూపాయి పెంచలేదు, రాబోయే రోజుల్లో కూడా పెంచేది లేదని ప్రకటించాం. కానీ వైసిపి వచ్చాక దొడ్డిదారిన 2సార్లు కరెంటు బిల్లులు పెంచి దొంగ దెబ్బతీశారు.
టిడిపి ప్రభుత్వ పనితీరు వల్లే 5ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాం. 4ఏళ్లుగా వరుసగా నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఎంపిక కావడం టిడిపి పారిశ్రామిక విధానానికి గొప్ప రేటింగ్. అలాంటిది పిపిఏలు రద్దు చేసి, పారిశ్రామిక వేత్తలను వాటాల కోసం బెదిరించి తరిమేసి, కప్పం కట్టాలంటూ వ్యాపారులను వేధిస్తూ వైసిపి గవర్నమెంట్ టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు. కియాకు ఇచ్చే రాయితీలు వైసిపి దృష్టిలో పెనాల్టీనా..? కియా రావడం వైసిపికి ఇష్టం లేదని ఈ వ్యాఖ్యలను బట్టే తెలుస్తోంది. వీళ్ల బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దళితులపై దాడి జరగని రోజులేదు. ఇళ్లు తగులపెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్ లు, దళిత వైద్యులపై అమానుషాలకు లెక్కేలేదు.
నిన్న కృష్ణా జిల్లాలో టిడిపి నేతల ‘‘ఛలో అయినంపూడి’’ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని గర్హిస్తున్నాం. ప్రతి జిల్లాలో వైసిపి బాధిత దళితులకు అండగా ఉండాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఒక నల్లజాతీయుడిని చంపేస్తే అమెరికా మొత్తం అట్టుడికింది. అలాంటిది ఇంతమంది దళితులపై ఇన్ని దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయం.
దళితులపై వైసిపి దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలి. ఎస్సీ కమిషన్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ దాడులకు అడ్డుకట్ట పడేలా చేయాలి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, అతి ప్రాచీన దేవాలయం. అంతర్వేది స్వామివారి రథం దగ్దం బాధాకరం. టిడిపి హయాంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు కూడా జరగకుండా అన్నిమతాలను గౌరవించాం. వైసిపి వచ్చాక దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల్లో అరాచకశక్తుల అకృత్యాలు పెరిగిపోయాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ప్రజల భవిష్యత్తును అంధకారంగా మార్చడాన్ని సహించే ప్రసక్తేలేదు.
ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే ప్రత్యక్ష సాక్ష్యం. అంతర్వేదిలో మంత్రుల నిలదీత, గోదావరి వరద ప్రాంతాల్లో మంత్రుల నిలదీత వైసిపి వైఫల్యాలకు ప్రబల నిదర్శనాలు.
వైసిపి ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే. టిడిపి స్కీమ్ లకు పేర్లు మార్చడం, రద్దులు-కోతలే తప్ప కొత్త పథకం ఒక్కటి కూడా లేదు. కంటివెలుగు, విద్యాదీవెన, సంపూర్ణ పోషణ అన్నీ పాత పథకాలే. వాటికి ముందు తండ్రీకొడుకుల పేర్లు తగిలిస్తున్నారు.. సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా..? రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక నిలిపేయడం సంపూర్ణ పోషణా..? గిరిజనుల ఫుడ్ బాస్కెట్ రద్దు సంపూర్ణ పోషణా..? టిడిపి కట్టిన అంగన్ వాడి భవనాలకు వైసిపి రంగులేయడం తప్ప వీళ్లు కొత్తగా కట్టిన భవనం ఒక్కటి కూడా లేదు.
జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరు. ప్రజలను నమ్మించడానికి అతను ఆడని నాటకం లేదు, చెప్పని అబద్దం లేదు. చివరికి మతం మార్చుకున్నట్లు కూడా దొంగ నాటకం ఆడారు. ఇటువంటి అబద్దాలకోరు ఎక్కడా లేడు. నోరు తెరిస్తే అబద్దం, మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ నైజం. రోజుకో నాటకం, పూటకో దుష్ప్రచారంతో కాలం గడిపేస్తున్నాడు.

‘‘పసుపు చైతన్యం’’ 100రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో చైతన్యం పెంచాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని’’ చంద్రబాబు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
వివిధ నాయకుల వ్యాఖ్యలు:
అరవింద్ బాబు(నరసరావు పేట): గత 15నెలల్లో 76కేసులు నాపై బనాయించారు. పేదలకు అండగా ఉన్నామనే అక్కసుతో తప్పుడు కేసులు బనాయించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా దందాలు పేట్రేగి పోయాయి. నరసరావు పేటలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పట్టుకోవడం 3వ సారి. ఏ రోజు ఎంత అవినీతి సంపాదన లెక్కల్లో వైసిపి నాయకులు తలమునకలుగా ఉన్నారు.
ప్రవీణ్(పొద్దుటూరు): సీఎం సొంత జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులను పెట్టి తాళ్లపొద్దుటూరు గ్రామస్థులను ఖాళీ చేయించడం హేయం. గండిపేట ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందించడంలో విఫలం చెందారు. రిజర్వాయర్లలో నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం. నిరాశ్రయులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో విఫలం. రెండవ సారి స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపన చేసి ఏడాది అవుతున్నా దాని అతీగతీ లేకుండా పోయింది.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు(కర్నూలు): పిచ్చోడి చేతిలో రాయిలా మారింది జగన్ చేతిలో పాలన. దుష్టశక్తులకు అధికారం ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకున్నాం అనే ఆవేదన ప్రజల్లో ఉంది. చంద్రబాబు ఉంటే ఇప్పుడీ కరోనాలో ఇలాగే వదిలేసేవారా అని జనమే అంటున్నారు. ప్రభుత్వం ద్వారా పేదలకు వైద్యం అందడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులలో అధిక వసూళ్లతో అల్లాడుతున్నారు.
గొల్లపల్లి సూర్యారావు(మాజీ మంత్రి): హిందూ దేవాలయాలపై ఈవిధమైన దాడులు గతంలో ఎన్నడూ లేవు. అరాచక శక్తుల అకృత్యం అంతర్వేది రథం దగ్దం. గోడ వెనుక మద్యం సీసాలే అందుకు సాక్ష్యం. టిడిపి నిజ నిర్దారణ కమిటి పరిశీలనలో ఇది అరాచకశక్తుల అకృత్యమేనని స్థానికులే తెలిపారు. అలాంటిది పొంతనలేని కథనాలతో జరిగిన దారుణాన్ని కప్పిపెట్టాలని వైసిపి ప్రభుత్వం చూస్తోంది. దీనిపై అత్యున్నత స్థాయి విచారణ జరిపిస్తేనే అన్నినిజాలు బైటకు వస్తాయి.
గన్ని కృష్ణ: జనవరిలో పిఠాపురంలో 26దేవాలయాలను ధ్వంసం చేశారు. పిచ్చోడి పనిగా ముద్రవేసి గాలికి వదిలేశారు. నవంబరులో గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద కనకదుర్గమ్మ ఆలయాన్ని కూల్చేశారు. ఇప్పుడు అంతర్వేదిలో రథం దగ్దం, నెల్లూరు జిల్లా బిట్రగుంటలో రథం దగ్దం కూడా పిచ్చోళ్ల పనేనా..? ఒక పథకం ప్రకారం ఆలయాలపై దాడులు జరుగుతున్నా వైసిపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి(ఎమ్మెల్యే): ప్రభుత్వ ప్రకటనల్లో టిడిపిపై దుష్ప్రచారం గర్హనీయం. ప్రజాధనంతో మాజీ సిఎం చంద్రబాబుపై నిందాపూర్వక ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఒక పార్టీపై, నాయకుడిపై బురద జల్లడానికి ప్రజాధనంతో మీడియాలో ప్రకటనలు ఇచ్చే దుష్ట సాంప్రదాయాన్ని వైసిపి తెచ్చింది. జగన్ పాలనలో రద్దులు-కోతలు, పథకాల పేరు మార్పులు తప్ప ప్రజలకు చేసింది శూన్యం.

మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి(తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు): వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు తెచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. లక్షలాది సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్లను, వందలాది సబ్ స్టేషన్లను నెలకొల్పడం జరిగింది. నదుల అనుసందానం టిడిపి ఘనతే. 15నెలల పాలనలో వైసిపి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యం. రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానానికి, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానానికి ఏపిని తెచ్చిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.

error: Content is protected !!