Sootigaa.com

Straight to the point.

డీజీపీ గౌతం సవాంగ్ కు చంద్రబాబు లేఖ

1 min read
TDP President and leader of opposition Sri N. Chandrababu Naidu wrote a letter to AP DGP Gautham Savang regarding the suicide of a Dalit driver post alleged threats from YCP people.

అమరావతి: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు..చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ దళిత యువకుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు..

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు..వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడంతో ఇష్టారాజ్యంగా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని..ఓం ప్రకాష్ కాల్ లిస్ట్‌ను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు.

error: Content is protected !!