Sootigaa.com

Straight to the point.

తెలంగాణ లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ లిస్ట్ ఖరారు

1 min read
DCCB

DCCB Telangana

తెలంగాణ లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఖరారు!!! హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను టీఆర్ఎస్ శనివారం ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేయగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌ లోని ఎన్నికల పరిశీలకులకు శుక్రవారం అంద జేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్‌ చైర్మన్ పేర్లను ప్రకటించారు. జిల్లాల వారీగా ఎంపికైన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు..

ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వర రావు,
ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరి రావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస్.
ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్‌గా నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్‌గా రఘునందన్‌ రెడ్డి.
డీసీఎంఎస్ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమురం మాంతయ్య. 
వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మర్నేని రవీందర్‌ రావు, వైస్ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌ రెడ్డి.
మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్‌ చైర్మన్‌గా కోరమోని వెంకటయ్య.
మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా హర్యా నాయక్‌. 
రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చెర్మన్‌గా బి. మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య.
రంగారెడ్డి డీసీఎంఎస్‌ చెర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మధుకర్ రెడ్డి.
కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా రమేష్.
కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫక్రుద్దీన్.
నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌ రెడ్డి.

error: Content is protected !!