Sootigaa.com

Straight to the point.

టాస్క్ ఫోర్స్ పై స్మగ్లర్ల దాడి

1 min read

చంద్రగిరి సమీపంలో ని భీమవరం వద్ద శేషాచలం అడవుల్లో దాదాపు 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై రాళ్లతో దాడి : ఒక రౌండ్ గాలిలో కాల్పులు : ఒక స్మగ్లర్ పట్టివేత : మిగిలిన వారి కోసం గాలింపులు

తెగబడ్డ స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై రాళ్లతో దాడి
గాలిలో కాల్పులు జరిపిన టాస్క్ ఫోర్స్
దుంగలు వదిలి పారిపోయిన స్మగ్లర్లుౌఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి బరితెగించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై రాళ్లతో దాడికి దిగారు. ఆరు దుంగలు వదిలి చీకటిలో పారిపోగా ఒక స్మగ్లర్ ను పట్టుకోగలిగారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య సూచనల మేరకు ఆర్ ఎస్ ఐ విజయ్ నరసింహులు, జానీ బాషా బృందం ఆర్ ఐ మురళీ పధకం ప్రకారం భీమవరం బీట్ లోని శేషాచలం అడవుల్లో గురువారం సాయత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరు శుక్రవారం ఉదయం మూలపల్లి చెరువు ప్రాంతానికి చేరుకోగా పొదల మధ్య అలికిడి వినిపించింది. దీంతో అప్రమత్తమైన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అటు వైపు అడుగులు వేశారు. వెంటనే వారిపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు దాడి నుంచి తప్పించుకునేందుకు విజయ్ టీమ్ గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు ఆరు దుంగలను విడిచి పారిపోయారు.

చీకటిలో వారిని వెంబడించగా ఒక స్మగ్లర్ దొరికాడు. మిగిలిన వారికోసం అతనిని తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకా నాచమలై గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (36) గా గుర్తించారు. కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ అల్లా బక్ష్, సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ చెందు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన విజయ్ టీమ్ ను టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్, డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య అభినందించారు.

error: Content is protected !!