Sootigaa.com

Straight to the point.

జీవో 38రద్దు చేయడం రైతుద్రోహం ~ యనమల

1 min read

అమరావతి: రైతు రుణమాఫీ ఎగ్గొట్టడంపై మండిపడ్డ యనమల. పత్రికా ప్రకటనలో వైసిపి రైతాంగ వ్యతిరేక చర్యలపై ధ్వజమెత్తిన యనమల.

రుణ ఉపశమనం జీవో 38రద్దు చేయడం రైతుద్రోహం. 33లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.7,582కోట్లను ఎగ్గొట్టడం రాష్ట్ర రైతులపై గొడ్డలిపెట్టు.

ఏ ప్రభుత్వం అయినా పేదలకు పెట్టడంలో పోటీపడాలి.

అలాంటిది పేదల పొట్టగొట్టడంలో వైసిపి పోటి పడుతోంది.

ఏ పార్టీ అయినా పేదరికం తగ్గించడంలో పోటిపడాలి. కానీ వైసిపి నేతలు పేదరికాన్ని పెంచడంలో పోటిపడుతున్నారు.

4నెలలుగా వైసిపి రైతాంగ చర్యలు మితిమీరాయి. ఇంకా 4నెలలు కాకుండానే 150మంది రైతుల ఆత్మహత్యలు.

పేపర్లలో, ఛానళ్లలో రైతు ఆత్మహత్యల కథనాలు లేని రోజు లేదు.

ఈ దుర్భర పరిస్థితుల్లో రైతుల్లో భవిష్యత్తుపై భరోసా పెంచాలి. అలాంటిది రైతుల్లో మరింత నిరాశ, నిస్పృహలు పెంచడం గర్హనీయం.

4వ విడతకు సంబంధించి 2లక్షల మంది ఖాతాల్లో రూ.376కోట్లు ఇప్పటికే జమపడ్డాయి. మిగిలిన రూ.3,603కోట్లతో పాటు 5వ విడత రూ.3,979కోట్లు చెల్లించాలి. అలాంటిది ఆ మొత్తాన్ని ఎగ్గొట్టడం గర్హనీయం.

రైతుకు ఒక రూపాయి ఇచ్చే ప్రభుత్వాన్నే ఇప్పటిదాకా చూశాం. రైతు నోటికాడ కూడు లాక్కునే దుర్మార్గ పార్టీని ఇప్పుడే చూస్తున్నాం.
టిడిపి తెచ్చిన ‘‘అన్నదాత సుఖీభవ’’ రద్దు చేశారు. అమల్లో ఉన్న పథకాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు.
ఎన్నికల ముందు ‘రైతుభరోసా’ అన్నారు, ఇప్పుడు ఏకంగా రైతులనే బలి తీసుకుంటున్నారు..?

‘‘రైతు బలి’’ అని ఇంకో స్కీమ్ తీసుకువస్తారేమో..?
ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ ప్రభుత్వాలు తెచ్చిన స్కీమ్ లను తరువాత ప్రభుత్వాలు కొనసాగించాయి. మరిన్ని కొత్త స్కీమ్ లను ప్రవేశ పెట్టాయి.

అంతేతప్ప గత ప్రభుత్వాల స్కీమ్ లను రద్దుచేసినవాళ్లు లేరు.

ఉన్న స్కీమ్ లను రద్దు చేసి, ఆ నిధులను మిగిలించుకుని వాటితో తమ స్కీమ్ లు అమలు చేద్దామనే పెడ ధోరణి ఇప్పుడే చూస్తున్నాం.

ఈ పెడ ధోరణులు పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడవు. పేదల వ్యతిరేక చర్యలను వైసిపి నేతలు ఇకనైనా మానుకోవాలి.

యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

error: Content is protected !!