Sootigaa.com

Straight to the point.

ఈ ప్రభుత్వం 32లక్షల మంది రైతుల కుటుంబాలను మోసం చేసింది ~ కొల్లు రవీంద్ర

1 min read

విజయవాడ: టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్

రైతుల పార్టీ అని చెప్పుకుంటున్న‌‌ వైసిపి ప్రభుత్వం 32లక్షల మంది రైతుల కుటుంబాలను మోసం చేసింది

రైతుల రుణమాఫీ చెల్లించకుండా జీఒ జారీ చేయడం దుర్మార్గం

చంద్రబాబు నాడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ‌మూడు‌ విడతలుగా రుణాలు మాఫీ‌ చేశారు

నాలుగు, ఐదు‌ విడతలకు నిధులు సమకూరిస్తే.. ఎన్నికల కోడ్ పేరుతో అప్పుడు వైసిపి వాళ్ళె అడ్డుకున్నారు

జగన్ అధికారం లోకి వచ్వాక టిడిపి ప్రభుత్వం చేసిన నిర్ణయాలను కక్షతో రద్దు చేస్తున్నారు

రైతు సంఘాలు, రైతు లతో కలిసి ఉద్యమిస్తాం

ప్రభుత్వం దిగివచ్చి రుణమాఫీ‌ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం

రైతులకు 12,500 ఇస్తామని చెప్పి…‌ఇప్పుడు కేంద్రం ఇస్తున్న ఆరు‌వేల కలిపి ఎలా ఇస్తారు

కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.. ‌ప్రజలను, రైతులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఇది

ఇసుక దొరక్క అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

వైసిపి ప్రజాప్రతినిధులు మాత్రం పక్క రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్నారు

ఇసుక పాలసీ వైసిపి నాయకులు, కార్యకర్తలు కోసం తెచ్చినట్లుగా ఉంది

జిల్లా మంత్రులు ప్రజలను కష్టాలు పట్టించుకోవడం లేదు

దీని పై కూడా ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం.

error: Content is protected !!